...

3 views

you r not u
నువ్వెప్పుడూ నువ్వు కాదు
నీలో అనేక యిద్దలు జరుగుతుననప్పుడు
నువ్వెప్పుడూ ఉత్తముడివి కాలేవు
నీలో అంతులేని అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నప్పుడు
ప్రపంచం నిన్ను స్వార్ధపరుడిగా చూస్తుంటుంది
కానీ నిజం నీకు మాత్రమే తెలుస్తుంటుంది
నువ్వు నీకు గా గెలవడానికి ప్రయత్నించవు
గెలిపించడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటావు
చుట్టూ నీ సైనికులే ఉంటారు
కానీ వాళ్ళు నీతోనే యుద్ధం చేస్తుంటారు
వ్యక్తిగా నువ్వు ఓడిపోతుంటావు
కానీ గెలిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటావు
నువ్వెప్పుడూ నువ్వు కాదు
నీవాళ్ళనుకున్నవాళ్ళు నీకు తోడు లేనప్పుడు
© director.gopikiran