...

1 views

జీవితం
@writer419

జీవితం, ఒక పుస్తకం అయితే,
అందులో పోషించే పాత్రలెన్నో…

జీవితం, ఒక రంగులరాట్నం అయితే,
అందులో పలురంగుల మనుషులెందరో…

జీవితం, ఒక బాటసారి అయితే,
అందులో ఎదురయ్యే అడ్డంకులెన్నో…

జీవితం, ఒక రాయి అయితే,
ఆ రాతిని చెక్కే శిల్పకారులెందరో…

జీవితం, ఒక రణరంగం అయితే,
అందులో యుద్ధాలు ఎదురయ్యేవెన్నో…

జీవితం, పుట్టకకు చావుకు
మధ్యలో జరుగుతున్న నాటకం,
ఆ శివయ్య ఆడిస్తున్నా జగన్నాటకం…


-©ఎస్.సురేఖ

© Singavarapu Surekha
#poem #poetrycommunity #telugupoetry #telugu #teluguquotes #lifepoems #lifestyle