...

4 views

తనువే ఊగెను . కృష్ణా..
తనువే తకదిమి, తకదిమి, మంటూ ఆడెరా.... కృష్ణా... కరుణానిధి వై,
కావగ రావా.. ముకుందా... మురారీ...

నీ పలుకుల మధువే కోరి తపమే చేశా..
నీ కన్నులు చూడగ మదినే విల్లు విరిచి,
శందించుకున్నా నాకు నేనే...
మధురం, శ్రవణం,
ప్రణయం, ప్రణవం,
స్వామీ.. మీ దర్శనం..
అభిభాగ్య దాయకం,
అనురాగరంజితం....

వెన్న కుండ, మనసు నిండా, నింపుకొంటినీ,
కలతల నారలు చుట్టుకొంటినీ,
బ్రద్దలు చేయగ,
భారము లాగగ,
కదిలి రా, రా, కుంచిత వరణా...
భక్తవ శరణా....

దినము, దినమూ,
అను దినమూ,
నిన్నే తలచీ,
మదిలో మురిసీ,
తడిసిన ,
జడిసిన,
కన్నులివీ...
ఆరని,
తీరని,
ఆశా జ్యోతులివీ....



గుండెల మోయగా..,
సుందర రూపా..
మందార, మల్లే,
జాజి, చేమంతీ,
పూబంతులై,
నీ మెడలో,
నీ గుడి లో,
అలరాలు
అవకాశం నివ్వరా .
నీలమేఘ శ్యామ..
అభినంధన రామా...


తేనెలు కురియగ,
ప్రేమలు చిలకగ,
తనువే కవ్వమై,
తాడున బిగియగ,
తపించిన,
తల్పికమిది..
తన్మయా...


© గోవింద్ @...