...

3 views

మార్పురావాలి (కవిత)
మార్పురావాలి
****************
ఆదుర్దా ఆందోళన
పడవలసిన వారు పడకపోవడం
ప్రశాంతంగా ఉండడం
పరీక్షా సమయంలో
రాయవలసిన వారికి
దాని విలువ తెలియక పోవడం
సమయ పాలన లేకపోవటం
బాధ్యత రహితంగా ఉండటం
చదువుకోక పోవడం
చాలా తేలికగా తీసుకోవటం
సక్రమంగా ఉండకపోవడం
మంచి అలవాట్ల లేమి
ఎల్లప్పుడు టీవీ ఫోన్
ఫ్రెండ్స్ చాటింగ్ చీటింగ్
సిరియల్స్ ఓటిటి సినిమా
పైననే దృష్టి కేంద్రీకరించడం
పరీక్షలంటే బేఖాతరు చేయడం
విలువ తెలుసుకోక పోవటం
తల్లిదండ్రులకు అది వీడని భయం ఉపాధ్యాయులకు
ఊపిరి ‌సలపని పరిస్థితి
మంచి రిజల్ట్స్ కోసం తాపత్రయం తల్లిదండ్రులకు మంచి మార్కులు
ర్యాంకులతో పిల్లలు
పాసై మంచి ఉద్యోగాలు
సంపాదించి అందమైన భవిష్యత్తు సాధించాలని ఆకాంక్ష
నేడు అది తీరని వాంఛ
నేటి తరంలో అందరూ కాకపోవచ్చు !
కొందరి ప్రవర్తన భయంకరం
చదువక పోవటం నిరాసక్తి నిరాశ
పోకిరితనం దుస్సాంగత్యం
తరగతులు ఎగ్గొట్టడం
పరీక్షలు రాయక పోవటం
ఫలితం ఆలోచించక పోవడం
చేతులు కాలినంక ఆకులు
పట్టుకొనే చందం
ఎవరు ప్రయత్నించి
చదువుకొని పరీక్ష రాయాలో
వారు కాకుండా
చదువు చెప్పే గురువులు
కనిపెంచిన తల్లిదండ్రులు
ఆందోళన పడటం
గమనిస్తే ఎటు పయనిస్తుంది
నేటితరం ?
ఈ ధోరణి మారాలి !
పిల్లల్లో మార్పు రావాలి !
ఎవరైతే పరీక్ష రాస్తున్నారో
వారు బాధ్యతాయుతంగా
బాగా చదువుకుని పాటుపడి
పోటీతో పరీక్షలు రాయాలి
ఆ ఫలితాలు అమోఘం
అలా తయారు చేయవలసిన
బాధ్యత సమాజం పై
తల్లిదండ్రులపై ఉపాధ్యాయులపై
నేడు ఉన్నత స్థితిని సాధించిన
పూర్వవిద్యార్థులపై ఖచ్చితంగా
ఉంది ఏమంటారు ?
( నేటి పరీక్షా పరిస్థితిపై స్పందన )
_____________
సంధ్య సుత్రావె,
హైద్రాబాద్.
© sandhya sutrave