...

0 views

pala samudram
55 Cancri E అని ఒక గ్రహం వుంది. మన Milkyway Galaxy లోనే వుంది. ఏదో దాని సూర్యుడి చుట్టూ అది తిరుగుతూ వుంటుంది. మనభూమి కన్నా రెండింతలు వుంటుంది. చాలా పెద్దది. కేవలం 17గంటలలోనే తన సూర్యునికి ఒక ప్రదక్షిణం చేస్తుంది. అంటే మనకు ఏడాదికి ఒక ఏడాది కదా, దానిక్ కేవలం 17గంటలకో ఏడాది. చాలా వేడిగా వుంటుంది. 3900డిగ్రీలు. మన భూమికి చాలా వరకూ ఆక్సీజన్ కదా, ఆ గ్రహం చాలా వరకూ కర్బనమన్నమాట.

కార్బన్ అంత ఎక్కువ వుండీ, అంత ఎక్కువ ప్రెషర్ తో తిరిగీ వేడెక్కీ తిరిగీ వేడెక్కీ వుండటం వలన, ఆ కర్బనం కాస్తా వజ్రమై కూర్చుంది. (కార్బన్ కీ వజ్రానికీ ఒకటే అణువు తేడా)

అంటే ఇప్పుడు ఆ గ్రహమంతా ఒక వజ్రమన్నమాట. గ్రహమంత వజ్రం! మన మొత్తం భూమికన్నా రెండింతల వజ్రం.

ఎలా వచ్చింది అక్కడికి?

రాలేదు, కొన్ని ప్రత్యేక పరిస్థితులవలన ఏర్పడింది. అంతే.

55 Cancri E అంటే విన్నారుగా, మరి "విష్ణువు పాలసముద్రంలో వుంటాడు" అంటే పాల సముద్రానికి ఈ ప్రశ్నలేంటి? పాలెక్కడివి?, పెరుగు అవుతుందా? తోడు ఎక్కడిది? అన్ని గేదెలెక్కడివి? అసలవి గేదెపాలా గాడిదపాలా… అని అడగకూడదు.

గెలాక్సీ అంటే, మన పాలపుంత అన్నా కూడా ఓ పాలసముద్రమే, మన గెలాక్సీకి ఇంగ్లీషువారు, మనమూ పెట్టుకున్న పేరు, Milkyway Galaxy! అంటే పాల పుంత అని . అందులో పాలుండవు, పెరుగూ వుండదు. దాని పేరే అది. మైసూర్ బజ్జీలో లేని మైసూర్ లాగా.

ఇప్పుడు ఈ MilkywayGalaxy కీ, విశ్వం విష్ణుర్ వషట్కారో… అనగా బ్రహ్మాండమంతావిస్తరించివున్నవాడు "విష్ణువు" అనే అర్థం సరిపోతోంది కదూ… విష్ణువు పాలసముద్రంలో పడుకుంటాడు అంటే, ఆ పాలసముద్రం ఇదే కదా… సైంటిష్టులుకూడా ఏదో మ్యాటర్ ఈ బ్రహ్మాండమంతా విస్తరించి వుంది అనే అన్నారుకదా, అదే ఇదేమో… అంటే ఇప్పుడూ, ఇదే మాటను ఓ రెండువేల ఏళ్ళు తిప్పితే ఈ సైన్సు మాటను కూడా అప్పడికి అభూతకల్పననే అంటాం కదా… అలా… అప్పట్లో విష్ణుహు అన్నారు, ఇప్పుడు "మ్యాటరస్య" అంటున్నాము. అంతే…
© director.gopikiran