...

1 views

ఆశ
మరణించిన నాలోని ఆశ
చిగురించి మళ్లీ జీవించ మంటుంది.
ఆగితే చంద్రుడిలా కదిలితే గాలిలా
ఎండలో నీడలా
ఓటమెరుగాని జయంలా
ఉండిపొమ్మంటుంది..
ఈ మాట కొంచం లోతైనది జీవితం నీలో ఆగినది చాలా బేధం ఉంది జీవితంలో
జీవించడానికి..
మరియు జీవితాన్ని జీవించుటకు...
కష్టాల కడలిలో ఆశల సౌధాన్నీ
గుండె ముక్కల గోడలతో నిర్మించాను ..
అడి ఆశల అలలకు కొట్టుకొని పోకుండా
మది ముక్కలను అడ్డుగా
నిలిపాను...
సంపంగి బూర✍️