...

0 views

మేమే రాజా మేమే మంత్రి
అర్థమైన జీవితం అలవాటు కావడంలేదు,ఎందుకో అనుకునే సమయంలో ఓ అభయహస్తం ఆసరా ఇచ్చి నా శ్వాసకు ఊపిరి పోసింది.. పరిచయం ఇరువురి హృదయాల ప్రణయంగా మారి జీవితబంధమై కూర్చుంది.. తల్లడిల్లే హృదయానికి ఆలంబనై మౌనం వీడి మనస్ఫూర్తిగా మాటాడించింది.. నిండు కనులతో రహస్యించి చిరునవ్వులతో స్వాగతించి మంచి మనసుతో ప్రేమించి నిర్ణయాల నమ్మకం ఖాయం నన్ను తనలో జీవింప చేసింది.. మధురమైన మాటలు, మంచి వ్యవహారం మంచినీ మించిన ప్రవర్తన, గొప్పఆదర్శం, అందమైన ఆలోచన తనలోని గుణాలు నా దృష్టిలో రాజును చేసి నన్ను మంత్రిని చేసింది.జీవితం ఆనంద డోలికలైంది.. తనువులు వేరైనా హృదయం ఒకటై ఆలోచించే నమ్మకం మేమే.. మేమే మా పరిష్కార సమస్యల,లావాదేవీల మా పరిష్కార సమస్యల, లావాదేవీల లాభనష్టా
బేరీజులను కూడా ఒకే మస్తిష్కం తో ఆలోచించి కలిసి కట్టుగా జీవించ చివరాఖరుల మేమున్నంత వరకు నమ్మకం. నిర్ణయాల ఖాయం..
మా చిన్న సామ్రాజ్యానికి
మేమే రాజా మేమే మంత్రి...
సంపంగి బూర