...

1 views

కనుపాపల్లో వెన్నెల దాచి
కనుపాపల్లో వెన్నెలను దాచి
కనుమరుగయ్యావా? నేస్తమా!
నీలాల నింగి అంతా నిశీధి కౌగిలిలో చిక్కుకుంది!
నా ఆశలన్నీ తారలై మిణుకు మిణుకు మంటూ! నీకై వెతుకు నా అడుగులకు దారి చూపిస్తున్నాయి!
మబ్బుల చాటు దోబూచులాడుతున్నావో? లేక
నన్ను శోధిస్తున్నావో?కానీ, నీకై వేసే ప్రతి అడుగు ఎన్నో జ్ఞాపకాలను గుండె గూటికి చేరుస్తుంది!
గుండె బరువెక్కి అడుగులు తడబడినా
గమనం ఆగదు! నేస్తమా!
వెతికే కళ్ళకు నమ్మకం ఎక్కడో ఒక చోట తారసపడతావని!నీ పేరే మంత్రంలా! జపిస్తున్న పెదవులకు తెలుసు! అది నిశ్శబ్ద తరంగమై ఏ మూలో దాగున్న నిన్ను చేరుతుందని!
నీరూపు పదిల పర్చుకున్న హృదయానికి తెలుసు!ఏదో ఒకరోజు అడుగిడి ప్రాణం పోస్తావని!
ఇవన్నీ నువ్వు తమాషాకి దోబూచులాడుతుంటే! పర్వాలేదు మదిమందిరమున తీపిగురుతులై నిలిచిపోతాయి!కాదు నానుండి తప్పించుకునే ప్రయత్నాలైతే మాత్రం గుర్తుంచుకో! నేస్తమా! అవి వేదనా ముద్రలుగా ప్రతిక్షణం గుచ్చుతూ బాధిస్తాయి! మరి నువ్వే నిర్ణయించుకో! దాగుడుమూతలలో!తప్పించుకు తిరుగుతున్నావో!
© Dinesh muddada