...

10 views

''వరకట్నం''
''వరకట్నం''

ఇది వధువు తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యమైతే.‌.
వరుడికి మాత్రం అంటుకున్న దురహంకారం..
జీవం పోసిన ఆ దేవుడే ''వరకట్నం'' అనే మరణాన్ని కూడా ఇచ్చాడు..
ఇది ఆడపిల్లల బ్రతుకుపాలిట నిలచిన ఒక పాపం లాంటి శాపం..
ఆడపిల్ల అంటేనే భయపడే స్థితిని తెచ్చింది ఈ ''వరకట్నం''..
అబ్బాయిలకు మాత్రం ఇది వరం లాంటి ఒక ఆయుధం ..
చట్టాలు ఎన్ని తెచ్చినా చలించదు ఈ సమాజం..
రెండు జీవితాలను కలపాలంటే ఈ కట్నమే ప్రధానం..
''వరకట్నం''అనే తూకంతో అమ్మాయి మనసుని కొలవకండి..
కన్నవారి హృదయాలకు తను ఒక ప్రాణం..
నిన్ను నమ్మి వస్తుంది నువ్వే తన ప్రాణంగా నువ్వే తన సర్వశ్వమని బ్రతుకుతుంది..
నీ కోసం తన కుటుంబాన్ని, ఆత్మాభిమానాన్ని విడిచినపెట్టి వస్తుంది..
పసిపాప మనసు తనది.. కసితీరా వేధించకండి..
బంగారంలాంటి రూపం తనది.. బంగారంకోసం హింసించకండి..
తాళి నీవు కట్టావు.. దాన్ని ఉరి తాడులా మార్చకండి..
ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మీ స్వరూపం అంటారు..
అలాంటి లక్ష్మీ స్వరూపాన్ని అభిమానించండి కనీ అనుమానాలతో, అవమానాలతో వేధనకు గురిచేయకండి..
ఆ మహాతల్లి చాలదా ఇంకా లక్ష్మీ అంటూ కాంక్ష ఎందుకు..??
వరకట్నం అనే ''ఊబి''లోకి దిగకండి..
వరం లాంటి జీవితాన్ని నాశనం చేయకండి.. చేసుకోకండి..
ఆడపిల్లలం మేము.. ఆట బొమ్మలం కాదు..

Save Girls 🙏🏻🙏🏻

© Bindus_Quotes

#తెలుగుకోట్స్ #WritcoQuote #writco #WritcoCommunity #writer #dowrysystem #teluguquotes #quote #quoteswriter #bindus_quotes