...

11 views

ఆడపిల్ల (Girl)
"ఆడపిల్ల"
పుట్టగానే నేను ఆడపిల్లని..
నా తెలుగుభాష ఎంత గొప్ప భాష.‌.!!
పుట్టగానే చెప్పింది ఈడ కాదు నీ చోటు 'ఆడ'ని..
అదేం మాయో నా పుట్టింట నేను చాలా గొప్పదాన్ని..
బుట్టగౌను తొడిగినా, పగలబడి నవ్వినా..
తుళ్ళితుళ్ళి గంతులేసి ఆడినా..
పిచ్చిబొమ్మ గీసినా, అల్లరులే చేసినా..
అమ్మానాన్నలకు మురిపెం,‌ చేసేవారు గారాబం..
నా ఆటలతో,మాటలతో ఇల్లంతా సంభరాలే..
నా ముగ్గులకు వాకిటి ముంగిలంతా మెరిసేది..
నా వంటలకు వీధివీధులంతా ఘుమఘుమలే
రుచిలో హెచ్చుతగ్గులున్నా నాన్నకెంతో నచ్చేవి..
నా పుట్టింట నేను మహారాణిని యువరాణిని..
వయసుకి వచ్చి పరువంలోకి అడుడిగినాక
ఆడపిల్లని కాస్త అదే ఇంటి ఆడపడుచుగా మారి
అయ్యాను 'ఆడ'పిల్లని అత్తారింట అడుగుపెడుతూ..
పడుచుదనం ఎప్పటికీ తగ్గకుండా
ఉండాలనేమో 'ఆడ'పడుచు అన్నారు..
అదేం మాయో ఏమో అత్తారింట నేను శూన్యాన్ని..
ఆ కట్టు ఏంటి?? ఆ బొట్టేంటి??
ఆ మాట ఏంటి?? ఆ నవ్వు ఏంటి??
ఆ నడక ఏంటి?? ఆ నడత ఏంటి??
పనీపాటాలేకుండా ఆ బొమ్మలేంటి??
అమ్మలక్కలతో ఆ ముచ్చట్లేంటి??
అబ్బో చదువు ఎంతమంది చదవలేదు??
అంటూ అందరికీ అయ్యాను నేనో వింత..
ఆ ఇంటి మాట,పాట.. ఆ ఇంటి కట్టు,బొట్టు..
ఆ ఇంటి తీరు, ఆ వంట తీరు..
ఆ ఇంటి అలవాట్లు ఈ ఇంట అయ్యాయి పొరపాట్లు..
అదొక అందమైన ప్రపంచం.. ఇదొక వింత ప్రపంచం..
ఆయనకి ఇష్టమైన సినిమాలు..
అత్తగారు మెచ్చే మడితడిల మహిమలు..
మామగారికి నచ్చిన కూరలు..
ఆడపడుచుకు నచ్చిన చీరలు..
బావగారికి నచ్చిన సరదాలు..
మరిదిగారికి నచ్చిన విలాసాలు..
ఆయనకి నచ్చేలా కాఫీ,టిఫినీలు..
పిల్లలు మెచ్చే టాఫీ,క్యాండీలు..
నా ఇష్టం మరచిపోవడం ఎంత కష్టం..
ఇంత కష్టం తరువాత నాకు దక్కే అదృష్టం,
నా ఇష్టమే ఆమె ఇష్టం(మొగుడి గారి మురిపెం)..
నా కోడలికి మడితడి అన్ని నేర్పుకున్నాను(అత్తగారి ఔదార్యం)..
మా వంట పద్ధతులు నేర్చుకుంది (మామగారికి సంతోషం)..
వదనకి సెలెక్షనే రాదు (ఆడపడుచు గొప్పలు)..
మా అమ్మాయి అత్తారింటిలో పాలల్లో తేనెలా
కలిసిపోయింది (అమ్మానాన్నల సంతోషం)..
కలిసిపోయేలా కరిగిపోయాను..
ఇలా కరగక నేను నేనులా ఉంటే..
ఆవిడకి తలబిరుసు, చాలా గర్వం..
ఓ మడాతడా ఏ సంప్రదాయం నేర్పలేదంటూ ఆరళ్ళు..
ఆ వంట రామరామ నోట పెట్టలేం..
ఆ బట్టలా ఛీ అదేం సెలక్షన్ అంటూ నొక్కుళ్ళు..
ఎన్ని నేర్చినా నేర్చుకుంటూనే ఉండాలి..
కొత్త ఫోన్ల కన్నా త్వరత్వరగా ఎప్పుడూ
అప్డేట్ అవుతూనే ఉండాలి..
జీవితం అంటే మార్పు.. కాని ఆడపిల్ల కన్నా
త్వరగా ఏది మారదు ఈ ప్రపంచంలో..
ఇది ఆడపిల్లగా నా కథ కాదు.. ప్రతి ఆడపిల్ల ఆవేదన..
© Bindus_Quotes #Girls'Life #girl #lifelesson #yqwriter #writco #writcoapp #teluguquotes #trending #story #bindus_quotes @Bindu_Quotes_Writer