...

1 views

ఒంటరి పోరాటం
దిగులు నిండిన ఒంటరిలో మునిగిన ఆలోచనలు తీరని కోరికలు పురుడు పోసుకుంటున్నాయి సిద్ధమంటూ పోరాటానికి
కన్నీటి కావ్యాలుగా ఒంపుకున్న మౌనాలలో నిండిన అనిర్వచిత క్షణాలే నాలోని ఒంటరి పోరాటాలు ...
మనసు కార్చిన కన్నీళ్లు నీవు చూడకూడదనీ, కారే అశ్రువులను నీవు తుడవకూడదనీ, కంటిలోనే సమాధి చేశాను కష్టం బ్రతుకు నేర్పుతుంటే నష్టంతో నమ్మకాన్ని జయించాలని విశ్వాసంతో ఒంటరిగానే
పోరాడుతున్నాను ...
తుంటరి మనసుకి ఒంటరి గాయం నాదొక పోరాటం ...
సంపంగి బూర✍️